అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అసెంబ్లీ లాబీలో… విపక్ష, ప్రతిపక్ష సభ్యుల మధ్య సరదా సన్నివేశాలతో పాటు ఒకోసారి వాడి వేడి మాటల యుద్ధం కూడా నడుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు అసెంబ్లీ మొదలయ్యే ముందు లాబీలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ప్రతిపక్ష ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎదురు పడ్డారు.

అచ్చెన్నాయుడు… ఏమిటి నాని నల్లబడినట్లు ఉన్నావు అని సరదాగా అడగగా… మీలా ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుసుకోవడం లేదు… జనంలో తిరుగుతున్నాం అని నాని సమాధానం ఇచ్చారు. ఇదే సందర్భంలో ఇద్దరి మధ్య జగన్ ప్రభుత్వం ఇస్తానని చెప్పిన సన్నబియ్యంపై ఆసక్తికర చర్చ జరిగింది.

ప్రజలకు మీరు సన్నబియ్యం ఎప్పటి నుంచి ఇస్తున్నారు… మీ సన్నబియ్యం సంగతి తేలుస్తాను అని అచ్చెన్నాయుడు అన్నారు. దానికి మంత్రి నాని ఘాటు రిప్లై ఇస్తూ నువ్వు ఏమి తేల్చలేవని, సన్నబియ్యం ఇచ్చి తీరుతామని, అవసరమైతే మీ ఇంటికి కూడా ఒక బస్తా బియ్యం పంపుతానని అనగా అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఇలాంటి సరదా సరదా సన్నివేశాలు అసెంబ్లీ జరుగుతునన్ని రోజులు టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఆసక్తిగా జరుగుతుంటాయి.

 
  •  
  •  
  •  
  •  
  •  
  •