మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరాం మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. అసెంబ్లీ పర్నిచర్ ను దాచిపెట్టిన వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలతో ఆయన మంగళగిరి కోర్టు కి హాజరయ్యారు. శివరాం కి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అందుకు సంబందించిన పూచికత్తును ఆయన కోర్టు కి సమర్పించారు. ప్రతి శుక్రవారం ఆయన తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి వచ్చి సంతకం పెట్టాలని కోర్టు ఆదేశించింది.

మరో వైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును బంజారాహిల్స్ పోలీసులు వేగవంతం చేశారు. పోలీసులు గుంటూరు వెళ్లి కోడెల కొడుకు శివరాం స్టేట్ మెంట్ ను రికార్డు చేయనున్నారు.