బంగ్లాదేశ్ తో జరగనున్న డే/నైట్ టెస్ట్ మ్యాచ్ కోసం భారత్ ఇప్పటికే తీవ్రంగా కసరత్తు చేస్తుంది. దీని గురించి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ పింక్ బాల్ తో ఆడటం చాల కొత్తగా ఉందని, ఆ బాల్ తో ఆడేటప్పుడు మరింత ఫోకస్ చేయవలసి ఉందని, పింక్ బాల్ తో ఆడే సమయంలో రెడ్ బాల్ తో పోలిస్తే మరింత బౌన్స్ అవుతుందని కళ్ళకు పింక్ కలర్ రిఫ్లెక్ట్ అవుతుందని విరాట్ కోహ్లీ తెలియచేశాడు. ఇక పింక్ బాల్ కొత్తగా ఉండటంతో ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వలన బాల్ పై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 సిరీస్ కు దూరంగా ఉన్న కోహ్లీ టెస్ట్ సిరీస్ కు సన్నద్ధమవుతున్నాడు.