కొన్ని రోజులుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు, రోహిత్ శర్మ మధ్య విబేధాలున్నాయని ఎన్నో వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. కొంత మందైతే విండీస్ టూర్ లో టెస్ట్ లలో స్థానం కోహ్లీ వల్లే రోహిత్ కు దక్కలేదని అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. ఇక చివరిగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సీరిస్ లో రోహిత్ శర్మకు తన కెరీర్ లో మొదటి సారి అవకాశం రావడం, దానిని రోహిత్ శర్మ వినియోగించుకొని మొదటి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో రెండు సెంచరీలు బాది తన సత్తా చాటాడు.

టీమిండియా రెండవ టెస్ట్ కు సన్నద్ధమవుతున్న వేళ ఈరోజు కోహ్లీ పుణేలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోహిత్ లాంటి ప్లేయర్ టాప్ ఆర్డర్ లో ఆడితే టెస్ట్ మ్యాచ్ లను ఈజీగా గెలుస్తామని, టెస్ట్ లలో రోహిత్ రాణించడం సంతోషకరమని, టాప్ ఆర్డర్ లో రోహిత్ బ్యాటింగ్ ను ఎంజాయ్ చేస్తున్నాడని, రెడ్ బాల్ క్రికెట్ ను రోహిత్ ఎంజాయ్ చేయనివ్వాలని అన్నాడు.