రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన గ్రామంగా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర గ్రామానికి గుంటూరు జిల్లాలోనే ఒక ప్రముఖమైన స్థానం కలిగి ఉంది. అలాంటి కొల్లిపర గ్రామంలో గత నాలుగు రోజులుగా ఎప్పుడు చూడని కక్షపూరితంగా కథనాలతో ఒక వర్గం మీడియా వండి వార్చడానికి ముందు వరుసలో ఉంది. ముందుగా కొల్లిపర గ్రామం గురించి చెప్పుకుంటే ఎన్నికల సమయంలో పార్టీల మధ్య పొరపొచ్చాలు ఉంటాయే తప్ప, ఎన్నికలు ముగిసిన తరువాత అన్ని పార్టీల వారు సఖ్యతతో మెలగడంతో పాటు, ఒక ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయాలు చేస్తుంటారు.

కొల్లిపర గ్రామంలో అన్ని కులాలు, అన్ని మతాల వారు ప్రశాంతంగా జీవనం కొనసాగించే పచ్చని పల్లెలో పచ్చ మీడియా ఒక చిన్న గొడవను రెండు కులాల మధ్య కుట్రగా మార్చి సిగ్గు లేకుండా నిసిగ్గుగా ఆరోపణలు గుప్పిస్తూ ప్రశాంతమైన ఊరిలో అలజడులు సృష్టించేందుకు ప్రధాన భూమిక పోషిస్తుంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ అధికారంలోకి రానుందని తెలిసి, గ్రామంలో జరిగిన ఒక చిన్న సంఘటనను అది రాష్ట్రంలో ఒక కులంపై జరుగుతున్న గొడవగా చిత్రీకరించేందుకు ఒక వర్గ మీడియాతో పాటు, ఒక పార్టీకి సంబంధించిన బయట వ్యక్తులు గ్రామంలోకి చొరబడి గందరగోళానికి గురిచేస్తున్నారు.

గుదిబండివారి పాలెం గ్రామానికి చెందిన గుదిబండి గోపిరెడ్డి అనే వ్యక్తి భద్రిరాజుపాలెం నుంచి గడ్డి ట్రాక్టర్ తో కొల్లిపర గ్రామంలోని పాలకేంద్రం సమీపానికి చెందిన పావులూరి బాబు రాజేంద్ర శర్మ ఇంటి వద్దకు చేరుకున్నారు. శర్మ ఇంటి వద్ద రోడ్డుపై వాహనాలు అడ్డుగా ఉండటంతో ఆ వాహనాలను తొలగించాలని కోరగా దానికి శర్మ ససేమిరా అనడంతో పాటు గోపిరెడ్డి మీద శర్మతో పాటు, అతని భార్య చేయ్యి చేసుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొనగా అక్కడే ఉన్న గ్రామస్థులు వారికి సర్ది చెప్పి అక్కడ నుంచి గోపిరెడ్డిని పంపించివేశారు.

శర్మ జరిగిన గొడవను మనస్సులో పెట్టుకుని తనపై ఒక పార్టీ వారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, తాను వైసీపీ పార్టీకి ఓటు వేయనందున తనపై కక్ష కట్టి దాడికి పాలపడ్డారని, బ్రాహ్మణ కులానికి చెందిన నాపై రెడ్డి కులం వారు దాడికి పాల్పడ్డారని తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా, పచ్చ మీడియా చేత వెనక నుండి కొంత మంది పచ్చ పార్టీ నేతలు రాజకీయ రంగు పులుమే ప్రయత్నం చేసారు. ఇంతటితో ఆగకుండా తెనాలికి చెందిన బ్రాహ్మణ సంఘాలను కొల్లిపర గ్రామానికి తీసుకువచ్చి తప్పుడు కేసులను గోపిరెడ్డి ఒక్కడి మీదనే కాకుండా మాజీ సర్పంచ్ వైసీపీ నేత అవుతు కృష్ణారెడ్డిపై కూడా ఆరోపణలు చేసి త్వరలో జరగబోయే పంచాయితీ ఎన్నికలలో రాజకీయంగా లబ్ది పొందాలని పచ్చ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది.

అసలు ముందుగా ఈ శర్మ ఎవరు ఇతని గత చరిత్ర గురించి తెలుసుకొనే ప్రయత్నంలో కొన్ని సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శర్మ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, ఇప్పుడు ఉంటున్న ఆమె నాలుగో భార్య అని, శర్మ ముగ్గురు భార్యలలో ఒక భార్య అప్పట్లో కొల్లిపర గ్రామంలో పెట్రోల్ పోసుకొని చనిపోయినట్లు తెలుస్తుంది. ఆ మరణంపై ఇంకా మిస్టర్ కొనసాగుతూనే ఉంది. ఆ మరణం తరువాత శర్మ గ్రామం వదిలి వెళ్లిపోయాడని, కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి గ్రామంలో అడుగుపెట్టి ప్రశాంతంగా ఉన్న గ్రామంలో రాజకీయ రంగు పులిమే ప్రక్రియ చేస్తున్నట్లు కనపడుతుంది.

శర్మ, అతని భార్య చేతిలో దాడికి గురైన గుదిబండి గోపిరెడ్డి గురించి తెలుసుకునే ప్రయత్నంలో అతను గ్రామంలో ఎప్పుడూ ఒక పార్టీ జెండా పట్టుకొని తిరిగిన దాఖలాలు లేవని పొలం పని చేసుకొంటూ తన జీవనాన్ని కొనసాగిస్తాడని, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి కాబట్టి శర్మ ఇది వైసీపీ పార్టీకి అంటగట్టి రాజకీయ రంగు పులమడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనపడుతుంది. కొల్లిపర గ్రామంలోని బ్రాహ్మణులు కూడా శర్మకు వత్తాసు పలికే అవకాశమే లేదని, ఇద్దరి మధ్య గొడవని రెండు కులాల మధ్య గొడవగా చిత్రీకరించడంతో కొంత మంది బ్రాహ్మణులే లోలోన మధనపడుతున్నట్లు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం కొల్లిపర గ్రామానికి చెందిన బ్రాహ్మణ కులస్థులు మీడియా సమావేశం పెట్టి నిజాలు వెలుగులోకి తీసుకురానున్నారని తెలుస్తుంది.

గొడవకు ప్రధాన కారకుడైన ఈ శర్మ ఇంటి నిర్మాణం కూడా కొంత అక్రమంగా జరిగిందని, ప్రధాన రోడ్డుని కొంత ఆక్రమించి నిర్మాణం చేపట్టాడని, మొదటి నుంచి తన ఇంటి మీదుగా వెళ్లే వాహనదారులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. కానీ బయట నుంచి బ్రాహ్మణ సంఘాలను తీసుకు వచ్చి శర్మ చేస్తున్న ఆరోపణలను వైసీపీ పార్టీ నేతలు తీవ్రంగా కండించారు. దీనిపై తగిన విచారణ చేసి తప్పు ఎవరిదైనా శిక్షించాలని, ఈ గొడవను వైసీపీ పార్టీకి అంటగట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పచ్చ పార్టీ వారిని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు.