నేడు దివంగతి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని రాజకీయ రంగ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకీ ఘనంగా నివాళులు అర్పించారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ రచయత కోన వెంకట్ కూడా వైఎస్ఆర్ తో ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఓసారి కోన వెంకట్ చెన్నై నుండి హైదరాబాద్ వస్తుంటే అదే విమానంలో వైఎస్ఆర్ ఉన్నారట. అప్పుడు వైఎస్ఆర్.. కొనను గుర్తుపట్టి దగ్గరకు రమ్మన్నారట. ఈ మధ్య నీ పేరు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. నువ్వు బాగా రాణిస్తున్నావు అని అనగానే ఆయనలో ఎక్కడ లేని సంతోషం వచ్చిందట. నువ్వు ఒకసారి మా ఇంటికి రావాలి. మా మేనల్లుడుకి థియేట‌ర్లున్నాయి సినిమాలు తీస్తానంటున్నాడు అని వైఎస్సార్ అనగానే తప్పకుండా వస్తాను సార్ అన్నాడట. దీంతో కూన తన చేత వైఎస్ఆర్ కథలు చెప్పించుకుంటారని ఆనందపడ్డాడట.

నువ్వు మా ఇంటికి వచ్చి వాడితో సినిమాలు తీయాలన్న ఆలోచన మాన్పించాలని చెప్పారట. వాడు సినిమాలని కెరీర్ వెస్ట్ చేసుకుంటున్నాడని.. వాడికి కాస్త బుద్ది చెప్పు అని వైఎస్ఆర్ అన్నారట. నువ్వు కూడా ఓ సినిమా తీసి నష్టపోయావు కదా అనే సరికి షాక్ అయ్యానని కోనవెంకట్ గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ ఇచ్చిన ఆ షాక్ నుండి తానూ కోలుకోలేక పోయానని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. ఇక అప్పట్లో కోన వెంకట్ నిర్మాతగా ‘తోకలేని పిట్ట’ సినిమా తీసి బాగా నష్టపోయారు. ఆ సినిమా ఓపెనింగ్ వైఎస్ఆర్ చేతుల మీదగా జరిగింది. అదంతా గుర్తు పెట్టుకుని వైఎస్ఆర్ తనతో ఈ విధంగా అన్నారని కోన వెంకట్ తన పేస్ బుక్ లో చెప్పుకొచ్చారు.

వైఎస్ఆర్ జయంతి: రైతులకు వరాలు ప్రకటించిన జగన్.. టీడీపీ ఆపిన బకాయిలన్నీ విడుదల..!

భారత్‌లో మొదటి కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ఎవరిపైనో తెలుసా..!