బిగ్ బాస్ తెలుగు సీజన్ కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ షో పూర్తి కావడంతో నాగార్జున తన కొత్త సినిమాపై ద్రుష్టి పెట్టాడు. గతంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ను తెరకెక్కిస్తాడని అభిమానులందరూ భావిస్తున్న తరుణంలో నాగార్జున ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టేసాడట. ఇక ఆ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా వ్యక్తిగత కారణాలతో ఆరు నెలలు సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాడట.

ఈ నేపథ్యంలో నాగార్జున ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడంటున్నారు. ‘మహర్షి’ సినిమా రైటర్ అయిన సోలమన్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు నాగ్. తాజా సమాచారం ప్రకారం మాట్ని ఎంటెర్టైమెంట్ పతాకంపై ఈ సినిమాను నిర్మించబోతున్నారు. రెండు రోజుల్లో ఈ మూవీపై అధికారిక ప్రకటన రానుందట.