ఈరోజు విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడటంతో పాటు అక్కడ ప్రేక్షకులు సినిమాపై పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంది అన్న విషయం పక్కన పెడితే ఈ సినిమాను విజయ్ దేవరకొండతో ముందుగా నిర్మించాలనుకున్నప్పుడు దర్శకుడుగా క్రాంతి మాధవ్ చెప్పిన కథకు ముగ్ధుడయ్యాడు.

అతడి కథతో సినిమా చేస్తున్న సమయంలో వరుస పెట్టి విజయ్ దేవరకొండకు ప్లాప్ లు రావడంతో అతడు క్రాంతి మాధవ్ ను పక్కన పెట్టి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను లైమ్ లైట్ లోకి తీసుకొని వచ్చి కథలో చాలా మార్పులు చేసి సినిమా చాలా వరకు రీ షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కాస్త “అర్జున్ రెడ్డి” పోలికలు ఉన్నట్లు మనకు ట్రైలర్, టీజర్ లో తెలుస్తూనే ఉంది.

అప్పటి నుంచి క్రాంతి మాధవ్ కాస్త విజయ్ దేవరకొండతో దూరం మైంటైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా విజయ్ దేవరకొండ మధ్యలో వేలు పెట్టి మొత్తం కథను మార్చివేయడంతో క్రాంతి మాధవ్ తన సన్నిహితుల దగ్గర కూడా అసహానానికి గురయ్యాడట. ఇలా కథలో మార్పులు చేర్పులు చేయడంతో విజయ్ దేవరకొండ సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. ఇలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేతులు పెట్టి కాల్చుకున్నవారే తప్ప ఇంతవరకు ఏ హీరో కూడా సక్సెస్ సాధించిన ధాఖలాలు లేవు.