రాహుల్‌ సిప్లిగంజ్‌ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ బిగ్ బాస్ షో తరువాత రాహుల్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎన్నో సినిమాలలో పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన రాహుల్.. ఇప్పుడు నటుడిగా మారుతున్నారు. తాజాగా ఆయనకు కృష్ణ వంశీ దర్శకత్వంలో నటించే అవకాశం దక్కింది. కృష్ణ వంశీ లేటెస్ట్ గా తెరకెక్కిస్తున్న సినిమా ‘రంగమార్తాండ’. ఈ సినిమాలో రాహుల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఈ విషయాన్నీ ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు.

ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నిన్నటిదాకా బుల్లి తెరపై సందడి చేసిన రాహుల్.. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై నటిస్తుండడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కృష్ణ వంశీ దర్శకత్వంలో నటించడం చాలా ఆనందంగా ఉందని.. అలాగే ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ వంటి గొప్ప నటుల సరసన నటించే అవకాశం రావడం జీవితంలో మరిచిపోనని ఆయన అన్నారు.

rahul