తెలంగాణాలో కరోనా వైరస్ కు సంబంధించిన కేసులు గత మూడు రోజులుగా ఊపందుకోవడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే కరోనా వైరస్ కేసులు 67 కు చేరుకోవడంతో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పిలుపునివ్వడం జరుగుతున్ది. ఇక 67 పాజిటివ్ కేసులలో 11 కేసులు నెగటివ్ వచ్చాయని, మిగతా వారు కూడా కోలుకుంటున్నారని కేటీఆర్ చిన్న ఆశ కల్పించడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరొకసారి ఆ 11 నమూనాలను టెస్ట్ లకు పంపించి పూర్తిగా నిర్ధారిన్చుకుంటామని చెప్పుకొచ్చారు. తెలంగాణను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పోరాడుతుందని ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మన దేశం మొత్తం మీద ఇప్పటికే వెయ్యి పాస్టివ్ కేసులు నమోదు కావడంతో ప్రధాని మోదీ మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కోడోత్ కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతుండటంతో పాటు గుంటూరులో నిన్న ఒక్కరోజే ఒకే కుటుంబంలో నాలుగురుకి పాజిటివ్ రావడం జరిగింది. ఇంకా గుంటూరు జిల్లాలో 44 అనుమానిత కేసులు ఉన్నట్లు మంత్రి మోపిదేవి ప్రకటించారు.