ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఎన్నికలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వాటిలో కూకట్ పల్లి నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏరికోరి నందమూరి హరికృష్ణ కూతురు చుండ్రు సుహాసినిని ఎన్నికలలో నిలబెట్టడంతో అందరి చూపు కూకట్ పల్లిపై పడింది. ఇక తెలుగుదేశం అభ్యర్థి కోసం గెలుపు కోసం ఒక సామజిక వర్గం వారు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి గుంపులు గుంపులుగా కూకట్ పల్లి పరిసర ప్రాంతాల హోటల్స్ లో బస చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే కోట్ల రూపాయల నగదుని ఆంధ్ర ప్రాంతం నుంచి తరలించి ఎన్ని కోట్లు ఖర్చైనా తెలుగుదేశం అభ్యర్థి చుండ్రు సుహాసిని గెలిపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. కూకట్ పల్లిలో ఓటుకి ఐదు వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ పంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న రాత్రి డబ్బులు పంచడానికి సిద్ధమైన టీడీపీ కార్యకర్తలను కూకట్ పల్లిలోని బాలాజీనగర్ లో జూపూడి ప్రభాకర్ రావు ఇంటి సమీపంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పట్టుకొని వారిని పోలీసులకు అప్పగించారు.

ఒక కుటుంబం ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఉంటే వారికి ఓటుకి అదనంగా మరో వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తునట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ పంచుతున్న డబ్బుతో పోటీ పడలేక టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు కొంత వెనకపడినట్లు కనపడుతుంది. గతంలో నంద్యాల ఎన్నికల తరహాలో రాజకీయం చేసి కూకట్ పల్లిలో తెలుగుదేశం పార్టీ పరువుని నిలుపుకోవాలని ఒక వర్గం ప్రజలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

మాధవరం కృష్ణారావు పొలిటికల్ ప్రొఫైల్   కూకట్‌పల్లి 2009 – 2014 ఎన్నికల ఫలితాలు