మనం కార్ లాక్ తీయాలంటే రిమోట్ అయినా ఉపయోగిస్తాం లేదా… కారు తాళం చెవినైనా ఉపయోగించి లాక్ ఓపెన్ చేస్తాం. కానీ అమెరికాలోని వాషింగ్టన్ కు చెందిన ఒక మహిళా తన చేతినే కార్ తాళం చేవిగా మార్చుకొని అందరిని నివ్వెర పరుస్తుంది. కారు స్టార్ట్ చేసేందుకు అవసరమైన ప్రత్యేకమైన చిప్ ను తన శరీరంలోకి చొప్పించుకోవడం ద్వారా అమెరికాలో ఓ మహిళా అందరిని ఔరా అనిపిస్తుంది.

తాను ఉపయోగించిన సాంకేతికతను “బయో హ్యాకింగ్” గా పిలుస్తారు. ఈ సాంకేతికత త్వరలో మరింత విస్తృతమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమీ డీడీ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. తన కారు వాలెట్ కార్డు నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ కార్డు (ఆర్ఎఫ్ఐడి) అనే చిప్ ను జాగ్రత్తగా వేరు చేసారు.ఆ వేరు చేసిన చిప్ ను నిపుణుల సహాయంతో తన కుడి చేతిలోకి ఎక్కించుకున్నారు. ఫలితంగా ఆమె చెయ్యే కారు తాళం చేవిగా మార్చుకొని అందరిని నివ్వెరపరుస్తుంది. ఇది అంతా నిపుణుల పర్యవేక్షణలో జరిగినట్లు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •