సాఫ్ట్ వేర్ సంస్థలో పని చేసే ఓ మహిళ జీన్స్ ప్యాంట్, స్లీవ్ లెస్ టాప్ ధరించి రావడంతో చెన్నైలోని కేకే నగర్ లో ఆర్టీఓ కార్యాలయ అధికారి ఆమెను డ్రైవింగ్ టెస్ట్ కు నిరాకరించారు. ఇంటికి వెళ్లి సరైన డ్రెస్ లో రావాలని కోరిన ఆ అధికారి.. షార్ట్స్ లో వచ్చిన మరో మహిళను కూడా కుదురైన డ్రెస్ లో రావాలని కోరినట్లు తెలిపారు. అలాగే షార్ట్స్ లుంగీలు వేసుకు వచ్చిన మగవారిని కూడా పొందుకైన డ్రెస్ ధరించి రావాలని కోరామని ఆర్టీఏ వర్గాలు తెలియచేశాము.

డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు ఎలాంటి డ్రెస్ కోడింగ్ లేనప్పటికీ.. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా పద్దతిగా డ్రెస్ చేసుకుని రావాలని మాత్రమే సూచించామన్నారు. ఇది ప్రభుత్వ కార్యాలయమని.. ఇక్కడికి వచ్చే వారిని సరైన దుస్తులు వేసుకుని రావాలని కోరడంలో తప్పేముందని ఆర్టీఏ అధికారి ప్రశ్నించారు.