దివంగత నందమూరి తారక రామారావు భార్య లక్ష్మి పార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. ఈమధ్యే ఆమెను ఏపీ ప్రభుత్వం తెలుగు అకాడమీ ఛైర్మెన్ గా ఎంపిక చేసారు. ఇక ఇప్పుడు కొత్తగా లక్ష్మిపార్వతి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. “డమరుకం” సినిమా దర్శకుడు శ్రీనివాస రెడ్డి తాను “రాగాల 24 గంటల్లో” అనే సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ముస్కాన్ అనే నటి ఈ విషయాన్ని వెల్లడించారు.

ముస్కాన్ తన తదుపరి సినిమాగా రాధాకృష్ణ పేరుతో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో లక్ష్మిపార్వతికీలక పాత్ర పోషిస్తున్నట్లు ముస్కాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మొదటి నుంచి కళారంగంపై లక్ష్మిపార్వతికి ఆసక్తి ఉన్నా ఎప్పుడు సినిమాలలో నటించలేదు. గతంలో ఆమె కొడుకుని కూడా హీరో చేయాలనీ ప్రయత్నించి ఎందుకో ఆగిపోయింది. ఇప్పుడు ఆమె ఒక సినిమాలో నటిస్తుండటంతో కొంత ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.