నిఖిల్, లావణ్య త్రిపాఠి ఇద్దరు కలసి నటిస్తున్న “అర్జున్ సురవరం” సినిమా వచ్చే వారం విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ట్రైలర్ విడుదలవడంతో పాటు ఆసక్తి రేగేలా ఉండటంతో ప్రేక్షకుల అటెన్షన్ ఈ సినిమాపైకి మళ్లింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి రానుండంతో సినిమాకు మంచి బజ్ వస్తుందని ఆలోచిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి హీరోయిన్ లావణ్య త్రిపాఠి అనేకమైన విషయాలను చెప్పుకొచ్చారు.

అసలు ఈ సినిమాను మొదట చేయాలని అనుకోలేదని, ఈ సినిమా అప్పటికే తమిళంలో రావడంతో రీమేక్ సినిమా అని వద్దనుకున్నానని, కానీ తరువాత ఒకసారి కథ వినాలని అనుకుని విన్న తరువాత కచ్చితంగా సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని ఈ సినిమాలో తాను మహిళా జర్నలిస్ట్ గా నటిస్తున్నానని, ఈ థ్రిల్లర్ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చేసానని చెప్పుకొచ్చింది. తాను తమిళ చిత్రం కూడా చూశానని చాల బాగా నచ్చిందని ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతానికి లావణ్య త్రిపాఠికి సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆధారపడి ఉంది. ఈ సినిమా హిట్ అయితే ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆలోచిస్తుంది. ఈ సినిమాకు దర్శకుడుగా టీఎన్ సంతోష్ వ్యవహరిస్తున్నారు. ఎన్నో సార్లు వాయిదా తరువాత నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.