లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశించి హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని అఖిల భారత బ్రాహ్మణ మహా సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు వెళ్లిన ఓం బిర్లా ట్వీటర్లో ఓ ట్వీట్ చేశారు. సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉంది. బ్రాహ్మణుల త్యాగం వల్లే ఈ రోజు ఈ సభ ఏర్పాటు అయ్యింది. అందుకే బ్రాహ్మణ సంఘం అందరికి ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యలు చేశారు ఓం బిర్లా. ఈ వ్యాఖ్యలపై హీరోయిన్ లావణ్య స్పందిస్తూ.. ఓ బ్రాహ్మణ అమ్మాయిగా ఈ కులం వారికి సమాజంలో ఎందుకింత అధమ స్థానం ఉందొ నాకు అర్ధం కావడం లేదు. మనం చేసే పనులు మన స్థాయిని తెలియచేస్తాయి కానీ కులం కాదు అని ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతాయనుకుందో ఏమో ఈ ట్వీటును తొలగించింది లావణ్య.

అయితే నిర్మొహమాటంగా ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు ట్వీట్ ను ఎందుకు తొలగించారంటూ నెటిజన్లు ఆమెపై విమర్శలు కురిపించారు. అలా ఎందుకు తొలగించాల్సి వచ్చిందో లావణ్య సమాధానం చెప్పారు. ఒక్కోసారి ఇలాంటి ట్వీట్లు తప్పుడు అర్ధాలకు దారితీస్తాయని ఆమె తెలియచేసారు. కులం,మతం కంటే మనం చేసే మంచి పనుల ద్వారానే మన మంచితనం బయట పడుతుందని నమ్ముతున్నానని తెలియచేసారు లావణ్య త్రిపాఠి.

  •  
  •  
  •  
  •  
  •  
  •