2017లో చివరిసారి భారత్ జట్టు తరుపున ఆడిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఆ తరువాత జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్ లో మాత్రం తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. కానీ అతడు మంచి పెర్ఫార్మన్స్ ఇస్తున్నా 2017 చివరిలో భారత్ జట్టుతో కలసి ప్రయాణించిన తరువాత తనను ఎందుకు పక్కన పెట్టారో తెలియదని, ఇంతవరకు దాని గురించి సెలెక్టర్లు తనతో కమ్యూనికేట్ చేయలేదని అసలు తాను జట్టుకు ఎందుకు దూరంగా ఉన్ననో తనకే తెలియదని అన్నారు.

ఇది నాకే ఎందుకు జరిగిందని తాను ఎప్పుడు ప్రశ్నించుకుంటానని, ఇప్పటి వరకు తాను ఎందుకు జట్టుకి దూరమయ్యానో ఎవరు సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని, తిరిగి తనకు జట్టులోకి రావాలని ఉందని తన కోరిక వెళ్లబుచ్చాడు. అమిత్ మిశ్రా ఐపీఎల్ లో 150 వికెట్లు తీసిన మొదటి ఇండియన్ బౌలర్ గా రికార్డ్స్ కు ఎక్కిబ సంగతి తెలిసిందే.

నైట్ క్లబ్ కు వచ్చిన ఒక్కడి వలన వందల మందికి కరోనా

విశాఖలో పబ్ జీ ఆట వందల మంది ప్రాణాలను కాపాడింది