కరోనా వైరస్ కారణంగా గత ఆరు నెలలుగా తిరుమలలో జనసంచారం తగ్గడంతో అడవులలో జంతువులు రోడ్ల మీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక సార్లు చిరుత పులులు, ఎలుగుబంట్లు రోడ్ల మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి చిరుత కలకలం రేపింది. మంగళవారం రాత్రి చిరుత సంచరించినట్లు అధికారులు గుర్తించారు.

మంగళవారం రాత్రి 10 గంటల నుండి 11 మధ్యలో చిరుత తిరిగినట్లు వారు తెలియచేసారు. పశ్చిమ మడవీధికి సమీపంలో ఉన్న మ్యూజియం వద్ద చిరుత కాసేపు సంచరించింది. కొద్దిగసేపు మ్యూజియం గోడపై ఉన్న చిరుత.. ఆ తరువాత శేషాచల అడవిలోకి వెళ్లిపోయింది. శ్రీవారి దర్శనం అనంతరం లడ్డు ప్రసాదం తీసుకుని భక్తులు బయటకి వచ్చే రోడ్లమీదే చిరుత తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం చిరుత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్రముఖ టీవీ యాంకర్..!

పరీక్ష రాయడానికి వచ్చిన టాప్ హీరోయిన్.. ఫోటో వైరల్..!