కరోనా దెబ్బతో ఇప్పుడు ప్రపంచం మొత్తం మాస్క్ లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాలలో అయితే మాస్క్ లేకుండా బయట కనపడితే జరిమానా కూడా విధిస్తున్నారు. కరోనా వైరస్ అంతలా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. దీనితో ఇప్పుడు మాస్క్ లు 10 రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. బ్రాండెడ్ మాస్క్ లతో పాటు మనం వేసుకునే బట్టలకు మ్యాచింగ్ మాస్క్ లు అబ్బో ఇలా ఒకటేమిటి అనేక రకాల మాస్క్ లు అందుబాటులో వచ్చాయి. ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఖర్చుపెడుతున్నది మాస్క్ ల మీద అంటే అతిశయోక్తి కాదు.

ఇప్పుడు ముఖానికి ధరించే మాస్క్ లను ఎల్జీ కంపెనీ ఏకంగా బ్యాటరీతో పనిచేసేవి తయారుచేసింది. మాస్క్ ఎక్కువ సేపు పెట్టుకోవడం వలన కొంతమందికి గాలి ఆడక ఇబ్బందులకు గురి కావడంతో పోర్టబుల్ ఎయిర్ ప్యూరీఫైయర్ మాస్క్ ను ఎల్జీ కంపెనీ తయారు చేసింది. ఇప్పుడున్న మాస్క్ ల కన్నా ఎక్కువసేపు వడపోత ప్రక్రియ చేపడుతుందని ఎల్జీ కంపెనీ చెబుతుంది. ఎయిర్ ప్యూరీఫైయర్ లలో వాడే H13 HEPA ఫిల్టర్లను ఎప్పటికప్పుడు మార్చుకునే అవకాశం ఉందని తెలియచేసారు. ఈ మాస్క్ దాదాపుగా పది గంటల పాటు బ్యాటరీతో నిర్విరామంగా పని చేస్తున్నదని చెబుతున్నారు. రకరకాల మాస్క్ లను వాడుతున్న వారు ఒకసారి ఈ మాస్క్ ను కూడా ట్రై చేసి చూడండి.

పోలీసుల కంట పడకుండా రూటు మార్చుతున్న పేకాట రాయుళ్లు

మీ పిల్లలు ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నారో గమనిస్తున్నారా లేదా?

బాహ్య ప్రపంచానికి దూరంగా బతికే 53 మంది ఆదివాసీలలో నలుగురికి కరోనా