60 ఏళ్లకు పైబడిన బామ్మ… రామ కృష్ణ అంటూ ఇంట్లో కూర్చోక వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈరోజు ఆమెకు ఏపీ సిఐడి పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. తల్లి ఈ పోస్ట్ ఎందుకు పెట్టావ్… దీనిని ఎవరు పెట్టమన్నారని అడిగితే ఎవరో పంపారు తాను కాపీ పేస్ట్ చేసానని చెబుతుందట. నీకు తెలుసా ఆ పోస్ట్ నిజమే అని అడిగితే మాత్రం నోరెత్తడం లేదట.

అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు కదా… ఒక ఐఫోన్ పంపించాడని ఇలా ఇష్టానుసారం పోస్టులు పెడితే ప్రభుత్వాలు చూస్తూ ఉరుకుంటాయంటే ఎలా బామ్మగారు. గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ అనే వృద్ధురాలు పక్కా తెలుగుదేశం కార్యకర్త అని సోషల్ మీడియాలో టీడీపీ నేతలతో కలసి దిగిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అతడి సుపుత్రుడు లోకేష్ బాబు ఇద్దరు కలసి వృద్ధుల చేత తప్పుడు పోస్టులు పెట్టిస్తే ప్రభుత్వం ఏమి వారిని ఏమి చేయలేదని ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారా అన్న వ్యాఖ్యానాలు కూడా వినపడుతున్నాయి.

లోకేష్ బాబు సోషల్ మీడియాలో ఉదయం నుంచి రంగనాయకమ్మకు అన్యాయం జరుగుతుందని, ఆమెపై ఇలా కేసులు పెట్టడం దారుణమని, ఒక ముసలావిడా అన్న కనికరం చూపెట్టడం లేదని గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడుపై 18 కేసులలో స్టేలు ఉన్నాయి. కొన్ని కేసులు ఇప్పుడిప్పుడే వెలికితీసే కార్యక్రమాలలో ఉన్నాయి. ఇక గత ఐదేళ్లలో చేసిన తప్పుడు పనులకు సంబంధించిన కేసులు అదనం. రేపోమాపో చంద్రబాబు నాయుడుకు నోటీసులు పంపిస్తే 70 ఏళ్ళ వృద్ధుడిపై ఏపీ ప్రభుత్వం ఇంతలా అరాచకం చేస్తుందని గగ్గోలు చేస్తాడేమో కాబోయే టీడీపీ అధ్యక్షుడు లోకేష్ బాబు.

గత రెండు నెలలుగా చంద్రబాబు అతడి పుత్రరత్నం రోడెక్కకుండా ఇంట్లో కూర్చుని సోషల్ మీడియాలో చిల్లర పోస్టులు పెట్టుకుంటూ ప్రజలకు మరింత దూరం అవుతున్నారని స్పష్టమవుతుంది. లోకేష్ బాబు పెట్టే పోస్టుల కిందా కామెంట్స్ ఒకసారి పరిశీలిస్తే నువ్వు కాబోయే టీడీపీ అధ్యక్షుడివని మర్చిపోయి ఇలా చిల్లర పోస్టులు పెట్టడం సిగ్గుగా ఉందని, నిన్ను మేము భరించక తప్పదని టీడీపీ నెటిజన్స్ నే కామెంట్స్ పెడుతున్నారంటే అతడు ఎంతలా దిగజారిపోయాడో తెలుస్తుంది.

ప్రభుత్వం గురించి తప్పుడు పోస్టులు పెట్టి బద్నామ్ చేయాలని చూస్తే రేపో, మాపో చచ్చే ముసలమ్మను కూడా ఏ ప్రభుత్వం వదలదన్న సంగతి 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకొనే చంద్రబాబు నాయుడుకి అర్ధం కావడం లేదా లేక వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లు అతడికి అల్జీమర రోగం ఏమైనా ముదిరిందా అన్న సందేహం వస్తుంది. ఇక్కడ కామెడీ ఏమిటంటే 70 ఏళ్ళ చంద్రబాబు నాయుడు 60 ఏళ్ళ రంగనాయకమ్మను ముసలావిడా అని అంటున్నాడంటే చంద్రబాబు నాయుడు ఇంకా స్వీట్ 16 లా ఫీల్ అవుతున్నాడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయని సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

దిక్కుమాలిన టిక్ టాక్ ఇద్దరిని బలిగొంది

నా బలం కలెక్టర్లు, ఎస్పీలే అంటూ సీఎం జగన్ పొగడ్తలు

నిర్మాత సురేష్ బాబుకి మైండ్ సక్రమంగానే పనిచేస్తుంది కదా