విశాఖ గ్యాస్ లీక్ కావడానికి ఎల్జి పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఈ కంపెనీని మూసివేశారు. అయితే లాక్ డౌన్ సమయంలోను పరిశ్రమలో ప్రతిరోజు మెయింటెనెన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నిర్ధారణ అయ్యింది. లాక్ డౌన్ కారణంగా 45 మందికి మెయింటెనెన్స్ పాసులు జారీ చేశారు. అయినప్పటికీ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. పరిశ్రమ ట్యాంకుల్లో దాదాపు 2000 మెట్రిక్ టన్నుల స్టైరెన్‌ను నిల్వ చేశారు. అక్కడ 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంచడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం విఫలమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో స్టైరెన్ గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెన్ గ్యాస్ వేగంగా విస్తరించడంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది.

ఇక ఈ ఎల్జి పాలిమర్స్ పరిశ్రమను 1997లో ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో నెలకొల్పారు. 213 ఎకరాల విస్తీర్ణంలో 168 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయంతో ఈ సంస్థ ప్రారంభమైంది. ఈ పరిశ్రమ ప్రతిరోజు 417 టన్నుల పాలిస్టెరీన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని స్టెరీన్ అనే ముడి సరుకు ద్వారా ఉత్పత్తి చేయడం జరుగుతుంది.

విశాఖలో గ్యాస్ లీక్ తో చంద్రబాబు కుటిల బుద్ది బట్టబయలు

లీకైన గ్యాస్ పీలిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..!

దేశవ్యాప్తంగా చాపకింద నీరులా కరోనా వైరస్.. 1783 కి చేరిన కరోనా మరణాలు..!