ప్రతి మనిషికి జ్ఞాపకశక్తి ఎంతో అవసరం… జ్ఞాపకశక్తి లేకపోతే తాను ఏమి చేసినా ఉపయోగం ఉండదు. ఈరోజు చేసిన పనులు కొంత మంది తరువాత రోజుకే మర్చిపోతారు. అలా జరగడం వలన వారిలో ఏదో లోపం ఉందని అనుకుంటుంటారు. కానీ జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి రోజు క్యారెట్, క్యాలీఫ్లవర్ లను తీసుకొంటుండాలి.

50 నుంచి 60 గ్రాముల గోబీ, కొంచెం కొత్తిమీర తీసుకొని దానిపై కాస్త నిమ్మకాయ కలుపుకొని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట. భోజనం చేసిన తరువాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం కూడా ఉత్తమమని చెబుతున్నారు. మజ్జిగ తాగడం వలన ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయట. ఇక ఎప్పటికప్పుడు నీరు కూడా తాగుతూ ఉండాలి.

ఆరోగ్య వంతమైన కొవ్వు పదార్ధాలు అంటే ఇతర కొవ్వు పదార్ధాలతో పోలిస్తే ఒమేగా-3, ఫాటీ ఆమ్లాలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయట. ఇవి ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపల నుంచి లభిస్తాయి. అలాగే గుడ్డు, వాల్ నెట్ లలో కూడా ఒమేగా-3 ఫాటీ అమలాలు సంతృప్తికర స్థాయిలో ఉంటాయి.

మెదడును ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటానికి యాంటీ ఆక్సిడెంట్స్ కృషి చేస్తాయి. గ్రీన్ టీ, స్ట్రాబెర్రీ, బ్రకోలీ, క్యారెట్, వెల్లుల్లి, తృణధాన్యాలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.