కరోనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణంగా రోడ్ల మీద జనసంచారం బాగా తగ్గింది. దీంతో అడవిలో ఉన్న జంతువులు రోడ్ల పైకి వస్తున్న ఘటనలు అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం. తాజాగా గుజరాత్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. గిర్‌సోమనాథ్ జిల్లాలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో నాలుగు సింహాలు అంబులెన్స్ కు ఆడుతగిలాయి. అవి ఎటు పోకుండా అక్కడే ఉన్నాయి.

ఇక దీంతో చేసేదేమిలేక డ్రైవర్ అంబులెన్స్ అక్కడే ఆపివేశాడు. ఆ గర్భిణి అంబులెన్స్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది. దాదాపు 20 నిమిషాల పాటు అంబులెన్స్ ను అడ్డుగించిన ఆ సింహాలు ఎట్టికేలకు అడవిలోకి వెళ్లిపోయాయి. ఇక దీంతో అంబులెన్స్ లో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

విశాఖలో హెచ్‌పీసీఎల్ నుండి భారీగా పొగలు రావడంతో తీవ్ర కలకలం..!

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరబోతున్న టీడీపీ ఎమ్మెల్యే..!