సోమవారం నుండి ఏపీలో మద్యం షాపులు తెరిచిన సంగతి తెలిసిందే. దీంతో మందు బాబులు భారీగా షాపుల వద్దకు తరలి వస్తున్నారు. దీంతో కరోనా వైరస్ ఎక్కడ వ్యాపిస్తుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కావున ఇక మద్యం కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా గొడుగు, ఆధార్ కార్డు ఉండాలని గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వినూత్న కార్యక్రమాన్ని పెట్టారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మండుటెండల్లో సైతం మందు బాబులు భారీ ఎత్తున క్యూలైన్లలో ఉంటున్నారు. దీంతో కరోనా వ్యాపించకుండా ఈ విధంగా గొడుగు నిబంధన పెట్టినట్లు తెనాలి సిఐ హరికృష్ణ తెలియచేసారు. ఇక గొడుగు ఉండడం వల్ల ప్రజలు డిస్టెన్స్ తో ఉంటారని.. అలాగే వడదెబ్బ తగలకుండా ఉంటుందని అన్నారు.

ఇక మద్యం కోసం ఇతర ప్రాంతాల వారు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో మంగళవారం నుండి ఆధార్ కార్డు నిబంధన పెట్టారు. ఇక సిఐ ఆదేశాలతో మందు బాబులు గొడుగు పట్టుకుని క్యూ లైన్లో నిలబడ్డారు. మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచినా కూడా మందుబాబులు ఏ మాత్రం తగ్గడం లేదు.

liquer que lines

ఏపీలో కొత్తగా మరో 67 కరోనా పాజిటివ్ కేసులు.. జిల్లాల వారీగా కరోనా వివరాలు..!

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. మందు బాబులకు భారీ షాక్..!

వైరస్ కన్నా అది చాలా ప్రమాదకరమంటున్న విరాట్ కోహ్లీ