‘చంద్రయాన్ 2’ ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుని మీదకు దిగే 2.1 కిలోమీటర్ల ముందు తడబాటుకు గురికావడంతో ఇస్రో గ్రౌండ్ స్టేషన్ సిగ్నల్స్ కోల్పోయాయి. దీనిపై ఉత్కంఠత నెలకొనగా ఇస్రో చైర్మన్ శివన్ నిన్న వెల్లడిస్తూ విక్రమ్ ల్యాండర్ చంద్రుని మీదకు ల్యాండ్ అయిందని, సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని ఇప్పటికే వెల్లడించారు. దీంతో మరోసారి ‘చంద్రయాన్ 2’పై ఆశలు రేకెత్తాయి.

ఈ సందర్భంలో ఒక బాలుడు ఇస్రోకు రాసిన లేఖ వైరల్ గా మారింది. “దైర్యం కోల్పోవద్దు మనం తప్పకుండా చంద్రుణ్ణి చేరతాం. చంద్రయాన్ 3 మన లక్ష్యం. చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఇంకా చంద్రుని కక్ష్యలో ఉందన్న విషయం మర్చిపోవద్దు. అది మనకు ఇంకా ఫొటోలు పంపుతుంది. ల్యాండర్ పనిచేస్తూ ఫోటోలు పంపితే మనం విజయం సాధించినట్లే. ఇస్రో నువ్వు మాకు గర్వకారణం స్ఫూర్తిదాయకం” అని ఒక బాలుడు రాసిన లేఖ వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •