కరోనా కట్టడికి కేంద్రం విధించిన లాక్ డౌన్- 4 మే 31 తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు లాక్ డౌన్- 5 ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే లాక్ డౌన్ పొడిగిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. దశల వారీగా కొన్ని మినహాయింపులను ఇచ్చింది. జూన్ 8 నుండి రాష్ట్రంలో అన్ని ప్రార్ధన మందిరాలకు, రెస్టారెంట్లకు, హోటళ్లకు అనుమతి ఇచ్చింది.

ఇక జులై నుండి పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాలలో పేర్కొంది. ఇక లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా మూతపడ్డ సినిమా హాళ్లు, జిమ్‌లు, బార్లు, స్విమ్మింగ్ పూల్స్‌, ఆడిటోరియంల ప్రారంభంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. అలాగే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మతపరమైన కార్యక్రమాలపై కూడా త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. ఇక రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది.

కరోనా వైరస్ పై గుడ్ న్యూస్.. కొంత సానుకూల వాతావరణం..!

చిరంజీవి భజన కొట్టుకుంటుంటే, జగపతిబాబు నిశ్శబ్దంగా సామజిక సేవ కార్యక్రమాలు