దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. ఇక ఈ లాక్ డౌన్ వేళలో ప్రేమికుల విరహ వేదన అంతా ఇంతా కాదు. లవర్స్ ఇద్దరు చెరొక ప్లేస్ లో ఉండటంతో కలుసుకోలేకపోవడంతో పిచ్చెక్కిపోతున్నారు. ఇలానే ఒక వ్యక్తి తన ప్రియురాలిని గత రెండు నెలలుగా కలవకపోవడంతో పిచ్చెక్కిపోయి ఎలాగైనా కలవాలని అమ్మాయి వేషం వేసుకొని బైక్ మీద ఆమెను కలవడానికి బయలుదేరాడు.

లాక్ డౌన్ సమయంలో ఒక ప్రదేశం నుంచి మరొకచోటకు వెళుతుంటే పోలీసులు ఆపి అడుగుతారని, అదే మహిళను అయితే పంపించి వేస్తారని అతడు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. అతడు అమ్మాయిలా వేషధారణ మార్చి, మొహాన్ని మొత్తం కవర్ చేసేలా గుడ్డ కట్టుకొని అర్ధరాత్రి సమయంలో బయలుదేరడంతో, ఒకచోట అమ్మాయే అనుకోని పోలీసులు పంపించివేశారు.

మరొక చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆపి అర్ధరాత్రి వేళలో ఎక్కడకి వెళుతున్నావని అడుగగా, తాను మాట్లాడితే అబ్బాయినని గుర్తుపట్టేస్తారని, చేతితో సైగలు చేయడంతో పోలీసులు మాస్క్ తీసి మాట్లాడమనగా, అతడు మాస్క్ తీయడంతో పోలీసులు అతడి బద్నారం బయట పడింది ఇలా వేషం మార్చుకొని ఎందుకు వెళుతున్నావని పోలీసులు గట్టిగా అడగడంతో తాను తన ప్రియురాలిని కలవడానికి వెళుతున్నాని, పోలీసులు, తన ప్రియురాలి పేరెంట్స్ గుర్తు పట్టకుండా ఇలా చేసానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.

అతడు చేసిన పనికి లాక్ డౌన్ ఉల్లంఘించి ఇలా వేషం మార్చి మోసం చేయాలని చూడటంతో అతగాడిని కటకటాల వెనక్కు నెట్టేశారు. ఈ సంఘటన గుజరాత్ లోని సూరత్ ప్రాంతంలో జరిగింది. ఇలా ఎంతో మంది తమ ప్రియురాలను కలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో కొన్ని చోట్ల దొరికిపోగా, మరికొంత మంది లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారురా దేవుడా అంటూ ఎదురు చూస్తున్నారు.

లోకేష్ బాబు ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు, గట్టోడే గురు

లాక్ డౌన్ నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లడం లేదట