కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్ డౌన్ కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాలలో ఈ లాక్ డౌన్ అమలు అవుతుంది. అయితే ఈ లాక్ డౌన్ విషయంపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధనలు చేసింది. మూడు వారల లాక్ డౌన్ సరిపోదని.. ఇంకా దీనిని విడతల వారీగా పొడిగించాల్సి ఉందన్నారు. ఐదు రోజుల సడలింపుతో నాలుగు దశల్లో ఈ లాక్ డౌన్ లు అవసరమని.. కేంబ్రిడ్జ్ పరిశోధనలు తెలియచేస్తున్నాయి.

మూడు వారల లాక్ డౌన్ సరిపోదని ప్రధానంగా నమ్ముతున్నామని.. సడలింపులతో కూడిన లాక్ డౌన్ వల్ల వ్యక్తిగత నిర్బంధం కాంట్రాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ లాంటి నిబంధనలు సమర్ధవంతగా అమలు సాధ్యమని తద్వారా కేసుల సంఖ్య తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ థియరీటికల్ ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధకులు రాజేష్ సింగ్ ఈ అధ్యయన ఫలితాలను వెల్లడించారు.

మార్చి 25న లాక్ డౌన్ విధించిన తరువాత జరిగిన పరిణామాలను గుర్తించిన వీరు నాలుగు దశల్లో వేర్వేరు నియంత్రణ ప్రోటోకాల్ ను పరిగణలోకి తీసుకుని మూడు లాక్ డౌన్ లు అవసరమని వారు గుర్తించారు. అయితే ఈ మూడు లాక్ డౌన్ లు ఐదు రోజుల సడలింపుతో అమలు కావాలని.. 21 రోజుల నుండి 49 రోజుల కాలంలో మృతుల రేటు గణనీయంగా తగ్గుతుందని.. తమ అధ్యయనంలో తేలిందన్నారు.