కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ ను జూన్ 30 దాకా పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్-5 లో ఇప్పటికే కొన్ని సడలింపులిచ్చిన కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ఇచ్చింది. జూన్ 8 నుండి మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్ధనా మందిరాలు, మతపరమైన ప్రదేశాలకు అనుమతి ఇచ్చింది.

ఇక కరోనా నిబంధనలకు అనుగుణంగా హోటళ్లు, రెస్టారెంట్లును నిర్వహించవలెను. దేవాలయాల్లో, ప్రార్ధన మందిరాల్లో వేటిని చేతులతో తాకరాదు. భక్తులపై పవిత్ర జలాలను చల్లరాదు. మాస్కు ఉన్నవారికి మాత్రమే అనుమతి. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే దేవాలయాల్లోకి అనుమతి. గర్భిణీలు, వృద్ధులకు అనుమతి లేదు.

చంద్రబాబు తొలగించిన పేరును మళ్ళీ పునరుద్ధరిస్తూ సీఎం జగన్ నిర్ణయం..!

తెలంగాణలో 100 దాటిన కరోనా మరణాలు..!