గత నాలుగు నెలలుగా ఉన్న లాక్ డౌన్ ఇప్పుడు మెల్ల మెల్లగా లాక్ డౌన్ ఎత్తేస్తున్నా ఇంకా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో జనజీవనం ఇంకా స్థంబించిపోయే ఉంది. ఇక దీనితో దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయి నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బింద్ జిల్లాకు చెందిన 42 ఏళ్ళ రాజేష్ ముంబైలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతడికి లాక్ డౌన్ తో ఉద్యోగం పోవడంతో తిరిగి సొంత గ్రామానికి వచ్చేసాడు.

అతడికి భార్యతో పాటు ముగ్గురు కూతుర్లు ఉండటంతో ఉద్యోగం పోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది. ఈ విషయమై ప్రతిరోజు తన భార్యతో గొడవ జరుగుతుండేది. దీనిపై నిన్న రాత్రి విపరీతంగా భార్యాభర్తలు గొడవపడటంతో అతడు అసహనంతో ఇక తన కూతుర్లను పోషించలేనని నిస్సహాయతతో 10, 8, 5 ఏళ్ళ ముగ్గురు చిన్నారులను అర్ధరాత్రి పూట వారికి తాడు కట్టి తాను కూడా ఆ తాడు కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఉదయం స్థానికులు మృతదేహాలను గుర్తించి పోలీసులకు చెప్పడంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇలా లాక్ డౌన్ తో ఎంతో మంది ఉద్యోగాలు పోవడంతో కుటుంబపోషణ చేయలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఎంతో విషాదానికి గురి చేస్తున్నాయి.

రేపు ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త

పెళ్ళికి ఒప్పుకోలేదని ప్రియురాలి తండ్రిని పొడిచి చంపిన ప్రేమికుడి తండ్రి

అయోధ్య రామమందిర భూమి పూజను ఎంత మంది వీక్షించారో తెలుసా?