తూచ్ ఏమిటి జగన్ ఏమి చేస్తున్నావ్… అసలు తాము ఏవేవో చేయాలనుకున్నాం… ఇప్పుడు నువ్వెందుకు చేస్తున్నావ్… ఇప్పుడు నువ్వు చేసినా అవన్నీ మా ఖాతాలోకే వేయాలి. కారణం మేము చేయాలనుకున్నవి చివరకి ఎన్నికలు రావడంతో ఆగిపోయాయి… ఇది అన్యాయం… ప్రజలారా గమనించండి జగన్ చేసినా ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసినట్లే గమనించండి… వచ్చే ఎన్నికలలో జగన్ ఇప్పుడు ఏది చేసినా తాము చేసినట్లే భావించండి… ఇలా ఉంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అతడి సుపుత్రుడు లోకేష్ వ్యవహారం.

మొన్న సీఎం జగన్ గుంటూరు వేదికగా దాదాపుగా 3.70 లక్షల మంది ప్రజలకు 10 వేలు అంతకంటే తక్కువ డిపాజిట్ చేసి మోసపోయిన వారికి నేరుగా వారి అకౌంట్ లో డబ్బులు వేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. జగన్ ఎప్పుడైతే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నాడో.. తండ్రి కొడుకులు ఇద్దరు బయటకు వచ్చి దాని మీద పెద్ద రాద్ధాంతం చేసి మేము ఇవ్వాలనుకున్న దానిని జగన్ చేస్తున్నాడని, అప్పట్లో తమకు ఎన్నికలు రావడంతో చేయలేకపోయామని అన్నారు.

ఎన్నికలు రావడంతో ఇవ్వలేకపోయామని చెప్పే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఎన్నికల ముందు రోజు వరకు పసుపు కుంకుమ పధకానికి సంబంధించిన డబ్బులు ప్రజల అకౌంట్ లో వేస్తూనే ఉన్నారు. దానికి అడ్డు రాని ఎన్నికల కోడ్ అగ్రిగోల్డ్ బాధితులకు వేయడానికి ఎలా అడ్డువచ్చింది. అప్పటికప్పుడు ప్రజలను ఆకట్టుకొని వారిచేత ఓట్లు దండిగా వేయించుకోవడానికి చంద్రబాబు అండ్ కో పసుపు కుంకుమ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టినా ఆ డబ్బులు తీసుకున్న ప్రజలంతా వైసీపీ పార్టీకి ఓట్లు వేసి చంద్రబాబు పన్నిన కుయుక్తులకు అడ్డుకట్ట వేశారు.

ఇక మరోవైపున సీఎం జగన్ రెండు రోజుల క్రితం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రవేశ పెడుతున్నామంటే తాము తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నగరపాలక స్కూల్స్ లో పెట్టాలని చూశామని, కానీ సాక్షి పత్రిక తమపై అక్కసు వెళ్ళగక్కిందని “తెలుగుకు తెగులు” అంటు వ్యాఖ్యానాలు చేసిందని అన్నారు. సాక్షి పత్రిక అనేది జగన్ కుటుంబానికి సంబంధించింది. వారు ఎన్ని రాతలు రాసిన మీకు చేయాలన్న కృత నిచ్ఛయం ఉంటే చేసి తీరాలి. కానీ జగన్ పత్రిక రాసింది. మేము చేయలేదు. ఇప్పుడు జగన్ సర్కార్ ఎలా చేస్తుంది అంటే.

అప్పట్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికలు ఇదే ఇంగ్లీష్ మీడియం విద్య గురించి చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని ఆహా ఓహో అని ఇప్పుడు జగన్ అదే నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంటే “తెలుగుకు తెగులు” అని ఇప్పుడు వీరు వంత పడుతున్నారు. పత్రికలు అన్నాకా ఎవరకి అనుకూలంగా ఉంటే వారికి రాస్తారు. కానీ ఆ పత్రిక అలా ఎందుకు రాసింది అని చిన్న పిల్లల బొమ్మలాటల వలే మాట్లాడితే ఎవరు సహించరు. మీకు చేయాలన్న చిత సుద్ధి లేదు చేయలేదు. ఇప్పుడు సీఎం జగన్ కు చేయాలన్న చిత్త సుద్ధి ఉండటంతో ఎక్కడ జగన్ అన్ని స్కూల్స్ ను ఇంగ్లీష్ మీడియం కు మార్చేసి ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తాడో అన్న బాధా మాత్రం స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధినేత అతడి పుత్రుడు లోకేష్ లో స్పష్టంగా కనపడుతుంది.