లోకేష్ బాబు విశాఖ ఎయిర్పోర్ట్ లో తాను మంత్రిగా ఉన్నప్పుడు చిరుతిళ్ళ కోసం దాదాపుగా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడని గత పది రోజులుగా సోషల్ మీడియాలో అనేక కథనాలు వినపడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 13 లక్షలు బిల్ చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే క్లియర్ చేశారని, ఇంకా 12 లక్షల బిల్ పెండింగ్ లో ఉండటంతో ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడనుంచి కట్టాలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు అనేక వార్తలు వచ్చాయి.

దీనిపై సాక్షి పత్రిక తేదీలతో సహా లోకేష్ బాబు విశాఖ ఎయిర్పోర్ట్ లో తాను తిన్న చిరుతిళ్ళ వివరాలు బయటపెట్టడంతో ఈరోజు లోకేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా సాక్షి పత్రిక నిప్పులు కక్కారు. నీతిలేని కథనాలతో తనపై దృష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాక్షి పత్రిక వారు చూపిస్తున్న ఫుడ్ బిల్ సమయంలో తాను అనేక పర్యటనలలో బిజీగా ఉన్నానని అలాంటప్పుడు తన మీద అసత్య ప్రచారం చేయడానికి ఇలా దొంగరాతలు సాక్షి రాస్తోందని లోకేష్ బాబు అన్నారు. చిల్లర కథనాలు ఆపకపోతే మీ దొంగ పత్రిక బట్టలూడదీసి ప్రజల ముందు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నామని లోకేష్ బాబు అన్నారు.

లోకేష్ బాబు ఎలాంటి తప్పు చేయకపోతే… సాక్షి పత్రిక తప్పు చేస్తే ఆ బట్టలూడదీసి జనల ముందు నిలబెట్టే సదావకాశం ఇప్పుడు లోకేష్ బాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి వచ్చినట్లే కదా . దానిపై కోర్ట్ కు వెళ్లి సాక్షి పత్రికపై పరువు నష్టం దావా వేయవచ్చు కదా. ఇలా పరువు నష్టం దావా వేస్తానని లోకేష్ ఎక్కడ చెప్పట్లేదు ఎందుకో? అవును సాక్షి పత్రిక అలా కథనాలు వండి వారిస్తే ముమ్మాటికీ తప్పే. దీని మీద మరి లోకేష్ బాబు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. అసలే జగన్ ఎక్కడెక్కడ దొరుకుతాడా అని చూస్తున్న టీడీపీ వారికి జగన్ తో పాటు సాక్షి పత్రిక కూడా అడ్డంగా దొరికినట్లే కదా? దీనిపై వెంటనే కోర్టుకి వెళ్లి పరువు నష్టం దావా వేస్తే అందరి బతుకులు బయటకొస్తాయి కదా… ఎంతసేపటికి “చిల్లర కథనాలు ఆపకపోతే” అనే పదం ఎందుకు వస్తుంది.

అంటే మీరు విశాఖ ఎయిర్పోర్ట్ లో లేకుండా మీ పేరు చెప్పుకొని ఫ్యూజన్ ఫుడ్స్ సంస్థ అడ్డంగా ప్రజల డబ్బు దొబ్బేద్దామని చూసిందా? ఇలా కోర్టుకి వెళితే ఏమైనా అసలు బొక్కలు బయటపడతాయని పరువు నష్టం దావా విషయం గురించి ఎత్తడం లేదా? చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఆధారాలు దొరకకుండానే ముప్పుతిప్పలు పెడతాడు. ఇలా సాక్షి పత్రిక విషపు రాతలు రాసిందని నమ్మితే కోర్టుకి ఎందుకు వెళ్లడం లేదు? అయినా సాక్షి పత్రిక ఒక మాజీ మంత్రి, మాజీ సీఎం కొడుకు మీద తప్పుడు కథనాలు రాయాలని భావిస్తే ఇలా తారీకులతో సహా బయట పెట్టడదు కదా? ఇందులో మొత్తానికి ఏదో మతలబు ఉంది. దీనిపై రేపు సాక్షి పత్రిక ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. ఈ గొడవ ఎలాంటి మలుపు తీసుకొని ఎవరి వైపు వేలు చూపిస్తుందో చూడాలి.