సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సినిమా ‘దర్భార్’. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తమిళ దర్శకుడు ‘విశ్వాసం’ ఫేం శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రజనీకాంత్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించబోతున్నాడు. లోకేష్ కనకరాజ్ కు మరి పిలిచి అవకాశం ఇచ్చాడు రజనీకాంత్. ‘ఖైదీ’ సినిమాతో అందరు దృష్టిని ఆకర్షించిన లోకేష్.. విజయ్ తో ‘మాస్టర్’ సినిమా తీస్తున్నాడు. ఇక ‘మాస్టర్’ సినిమా పూర్తవగానే రజని సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అంటే జూన్ లో వీరి సినిమా షూటింగ్ మొదలవబోతుంది. ఈ లోగా శివ సినిమాను కూడా పూర్తి చేస్తాడు రజని. త్వరలోనే రాజకీయాలలో బిజీ కాబోతున్న రజనీకాంత్ త్వరత్వరగా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

  •  
  •  
  •  
  •  
  •  
  •