ఇప్పుడు ఏపీలో కుల, మత రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయి. అసలే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో మత రాజకీయాలతో బీజేపీ బిజీ బిజీగా ఉంటే జగన్ సర్కార్ పై కులంతో పాటు మతం లొల్లితో ఎలాగైనా కొన్ని వర్గాల నుంచి జగన్ ను దూరం చేయాలని చంద్రబాబు అండ్ కో ఎంతో హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగా ఎవరైనా దళితుడు, గిరిజనుడు ఇలా ఏ కులపొడిపై దాడి జరిగితే ఆ కులం పేరెత్తి రాజకీయాలు చేయాలని చంద్రబాబు అండ్ లోకేష్ ఉవ్విళ్ళూరుతున్నారు.

టీడీపీ పార్టీకి చెందిన బ్రహ్మం చౌదరి అనే అతను మంత్రి కొడాలి నానిపై తీవ్ర దూషణలకు దిగడంతో అతడిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనితో అతగాడికి అండగా ఉండేందుకు ఈరోజు నారా లోకేష్ బాబు ట్విట్టర్ లో “మేము కూడా తిట్టగలం కానీ మా పార్టీ సంస్కృతి అది కాదు అని చెప్పినందుకు TNSF మాజీ అధ్యక్షుడు బ్రహ్మంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా? బ్రహ్మంకి పార్టీ అండగా ఉంటుంది. మా కార్యకర్త విమర్శకి సమాధానం చెప్పే దమ్ములేక కేసులు పెట్టే జగన్ నాయకుడో? దద్దమ్మో వైకాపా శ్రేణులు తేల్చుకోవాలి” అంటూ ట్వీట్ చేశారు.

అసలు ఎప్పుడు కులాల పేరుతో రచ్చ చేసే తెలుగుదేశం పార్టీ అతడి పేరులోనే “బ్రహ్మం చౌదరి” అని ఉంటే “చౌదరి”ని తీసేసి “బ్రహ్మం” అని మాత్రమే లోకేష్ సంబోధించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. ఈ మధ్య వైసీపీ ప్రభుత్వంపై కుట్రలకు పాల్పడుతున్న కొంతమందిని గుర్తిస్తే అందరూ ఒక కులానికి చెందినవారే కనపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ది పొందిన ఆ కులం వారే అమరావతి రాజధాని పేరుతో పైడ్ ఆర్టిస్టులను దింపి ఇంకా అమరావతిలో ఉద్యమం జరుగుతుందని నిరూపించే పని లోకేష్ అండ్ కో తాపత్రయపడిపోతున్నారు.

కమ్మ కులాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు అండ్ లోకేష్ బాబు తమ కమ్మ కులాన్ని బ్రష్టు పట్టిస్తున్నాడని తమ కులపోళ్ళంతా మంచివారే అని కొంతమంది చేత దిక్కుమాలిన పనులు చేపిస్తున్నారని ఈమధ్య మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ చెప్పకనే చెప్పారు. ఏపీ మంత్రి కొడాలి నానిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ ఐన బ్రహ్మం చౌదరి కూడా అదే కమ్మ కులపోడు కావడంతో అతడి పేరు వెనుక తోక కత్తిరించి లోకేష్ ట్వీట్ చేయడం గమనార్హం. అసలు టీడీపీ పార్టీ ఇప్పుడు కులాన్ని అడ్డుపెట్టుకొని ఏదో చేయాలని చూస్తుందని, కమ్మ కులాన్ని కూడా బ్రస్టు పట్టిస్తున్నారని ఆ కులానికి చెందిన వారితో పాటు ఏపీ ప్రజలంధరకి తెలిసిపోయింది. అదే కమ్మ కులానికి చెందిన “బ్రహ్మం చౌదరి” చేత కూడా లోకేష్ బాబు తిట్టించడం అతడిని అరెస్ట్ చేయడంతో తెలివిగా అతడి పేరు వెనుక చౌదరి తీసేసి సంబోధించడం గమనార్హం.