దుబాయిలో సెల్స్ మన్ గా పనిచేస్తున్న భారతీయునికి లాటరీలో 20 కోట్ల రూపాయలు జాక్ పాట్ తగిలింది. కేరళకు చెందిన దిలీప్ కుమార్ ఉపాధి కోసమని దుబాయి వెళ్లి 17 సంవత్సరాల నుండి అజ్మన్ నగరంలో కుటుంబంతో కలసి ఉంటున్నాడు. అజ్మన్ నగరంలో ఓ ఆటో మొబైల్ సంస్థలో సెల్స్ మన్ గా పనిచేస్తున్న అతనికి కొద్దిరోజుల క్రిందట అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి నెల మూడవ తేదీన బిగ్ టికెట్ డ్రా పేరుతో నిర్వహించే లాటరీ టికెట్ ను 500 దిర్హామ్స్ (10 వేలు) పెట్టి కొనుగోలు చేసాడు. దీంతో దిలీప్ కు 20 కోట్ల రూపాయలు జాక్ పాట్ తగిలినట్లు స్థానిక వార్త సంస్థ తెలియచేసింది. ఇక గెలుచుకున్న కొంత సొమ్మును బ్యాంకు లోన్ తీరుస్తానని.. మిగతా సొమ్ముతో పిల్లలను బాగా చదివిస్తానని తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు దిలీప్ కుమార్.

‘మహాభారతం’ పనులు మొదలు పెడతానంటున్న రాజమౌళి..!

గుడ్ న్యూస్.. కరోనాను అడ్డుకునే యాంటీబాడీ గుర్తింపు..!

చైనాలో షాకింగ్ ఘటన.. ఓ యువతికి తరుచుగా తలనొప్పి రావడంతో..!