అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నాగ చైతన్య ఈ సినిమాలో తెలంగాణ యువకుడి పాత్రలో నటిస్తున్నారు. ‘ఫిదా’ సూపర్ హిట్ సినిమా తరువాత శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీగా ఆంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులను మేకర్స్ 18 కోట్లకు విక్రయించారని తెలుస్తోంది. డిజిటల్- శాటిలైట్ సహా డబ్బింగ్ హక్కులు కలుపుకుని ఇంత బిజినెస్ సాగింది. ఇక త్వరలోనే పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేయబోతున్నారు. ఇక కరోనా కట్టడి కాగానే భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర నిర్మాతలు.

మెడికల్‌ టెక్నీషియన్ల జీతాలు భారీగా పెంచిన సీఎం జగన్.. ఈరోజు నుండే అమలులోకి..!

దేశవ్యాప్తంగా కొత్తగా 18653 పాజిటివ్ కేసులు, 507 మరణాలు..!

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కుష్బూ కీలక పాత్ర..?