2019 ఏడాదికి గాను బీటెక్ నాలుగవ సంవత్సరం చదువుతున్న తాన్యా అరోరాకు ఏడాదికి 5.04 కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. పంజాబ్ లోని జలంధర్ లో లవ్ లీ ప్రొఫెషినల్ విశ్వవిద్యాలయంలో తాన్యా అరోరా బీటెక్ నాలుగవ సంవత్సరం చదువుతుంది. ఉద్యోగంలో చేరాక తాన్యా హైదరాబాద్ లోని మైక్రోసాఫ్ట్ ఇండియా ఆర్ అండ్ డి సెంటర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేయనుంది. గత మూడేళ్ళుగా ఎల్ పి యు విద్యార్థులు రికార్డ్ స్థాయిలో ఉద్యోగాలు సాదిస్తున్నారు. తాన్యాను చూసి చాలా గర్విస్తున్నట్లు వర్శిటీ ఛాన్సులర్ అశోక్ మిట్టల్ వ్యాఖ్యానించారు.