మలయాళ లెజెండ్ హీరో మోహన్ లాల్ హీరోగా వచ్చిన “లూసిఫర్” పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా తెలుగులో విడుదలైనా ప్రేక్షకులు సినిమా పేరు అంత క్యాచీగా ఉండకపోవడంతో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా చాల బాగుందని మౌత్ టాక్ స్ప్రెడ్ చేసే లోపే థియేటర్స్ నుంచి సినిమా ఎగిరిపోయింది. ఆ సినిమా రీమేక్ హక్కులు ఈమధ్య రామ్ చరణ్ తీసుకొని దానిని చిరంజీవి హీరోగా నిర్మించాలని అనుకున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవితో సినిమా తీయాలని భావించినా ఇప్పట్లో అది సాధ్యపడేలా లేదు. సుకుమార్ ప్రస్తుతానికి బన్నీ సినిమాతో బిజీగా ఉండటంతో పాటు రీమేక్ సినిమాకు డైరెక్ట్ చేయడం అంత ఇష్టం చూపించడం లేదట. “లూసిఫర్” లాంటి సినిమా కథలను సుకుమార్ అయితేనే న్యాయం చేస్తాడు. ప్రస్తుతానికి సుకుమార్ ఆ చిత్రంపై ఆసక్తి చూపించకుండా బన్నీ సినిమాపై ఫోకస్ పెడుతున్నాడు.

చిరంజీవి కూడా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకు ఇప్పటికే వెళ్లడంతో ప్రస్తుతానికి “లూసిఫర్” సినిమా కోల్డ్ స్టోరేజ్ కు వెళ్లిపోయినట్లు. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి – రామ్ చరణ్ ఇద్దరు నటించాలని ఆశ పడ్డారు. కానీ మరొక మంచి దర్శకుడు… “లూసిఫర్” సినిమాకు న్యాయం చేయగలడు అన్న ధీమా ఉన్న డైరెక్టర్ దొరికితే “లూసిఫర్” సినిమాను కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు తీస్తారేమో.