ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి తన పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినట్లు ప్రతి ఏడాది 20 శాతం మద్యం దుకాణాలను ఎత్తివేస్తూ మద్యం రేట్లను సామాన్యులకు అందకుండా షాక్ కొట్టేరీతిలో పెంచుకుంటూ పోతున్నారు. దీనితో లాక్ డౌన్ సమయంలో మద్యం ధరలను అమాంతం డబల్ చేసేయడంతో రోజువారి కూలి పనులు చేసుకునే వారికి మద్యం కొనడానికి డబ్బులేక గంజాయి, సారాయి వంటి వాటిని తాగడం మొదలుపెట్టారు.

కానీ ప్రభుత్వం వాటిని కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేసేయడంతో ఇక మద్యానికి బానిసలైన వారు మత్తు కోసం శానిటైజర్లకు అలవాటుపడ్డారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల శానిటైజెర్లు తాగడంతో అవి వికటించి కొన్ని మరణాలు కూడా సంభవించాయి. ఇక ఇప్పుడు కొత్తగా ఏపీలో శానిటైజెర్లు తాగుతున్న 144 మందిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేశారు. ఇక అక్రమంగా శానిటైజెర్లు తయారు చేస్తున్న వారిని ఇప్పటికే గుర్తించి 76 మందిపై కేసు కూడా నమోదు చేశారు. దీనితో మద్యం రేట్లు పెంచితే దొరక్క శానిటైజెర్లు తాగుతున్నారంటే, రాబోయే రోజులలో మద్యం పూర్తిగా దొరకకుండా చేస్తే అప్పుడు మత్తుకు బానిసైన వారి శానిటైజెర్లు లేదా మరొక దాని కోసం పాకులాడి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటారని ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే అర్ధమవుతుంది.

ఇలా మద్యానికి అలవాటు చేసిన ప్రభుత్వాలే మద్యాన్ని ఇప్పుడు ఎత్తేస్తామని చెబుతూ ప్రజల జీవితాలతో ఒకరకంగా ఆటలాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకొని వచ్చి ఒక క్వాటర్ మందు తాగి ఒళ్ళు నొప్పులను మర్చిపోవడానికి ఎంతో మంది మత్తుకి అలవాటుపడ్డారు. కొన్ని చోట్ల అయితే వారి భార్యలే ప్రోత్సహిస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఉదయం నుంచి పని చేసి వచ్చినప్పుడు కాస్త మద్యం తాగి కునుకు తీయడంలో తప్పులేదనేవారు ఉన్నారు.

కానీ చాలా తక్కువ చోట్ల మాత్రమే మద్యం కోసం ఇంట్లో భార్యలను హింసపెట్టేవారు ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని మద్యపాన నిషేధం వైపు సీఎం జగన్ అడుగులు వేస్తున్నాడు. సీఎం జగన్ తీసుకునే నిర్ణయం మంచిదే అయినా ఒక్కసారి అలవాటు పడిన ప్రాణం దాని నుంచి పక్కకు మల్లకపోతే ఇలా మత్తు కోసం శానిటైజర్లు లేదా మరొక రకమైన థాక్క్కువ రేటుకి దొరికే మాదక ద్రవ్యాలు తీసుకొని ప్రాణాలను గాలిలో కలిపేసుకుని పరిస్థితులు కొనితెచ్చే కన్నా పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ధరలు మందుబాబులకు అందుబాటులో ఉంచడం మంచిది.

19 ఏళ్ళ యువకుడు 26 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకొని భయంతో పరార్

తెలంగాణలో బీర్ల అమ్మకాలు తగ్గడానికి కారణం ఏపీలో నెలకొన్న పరిస్థితులేనా