తెలంగాణ ఎన్నికలలో తెరాస పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ కార్యవర్గం అభినందనలు తెలిపింది. మా అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రెండవ సారి ఘన విజయం సాధించినందుకు కేసీఆర్‌కు అభినందనలు. తెరాస ప్రభుత్వం చిత్రసీమ అభివృద్ధి కోసం ఎంతో కట్టుబడి ఉందని, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారిని, ఎఫ్.డి.సి. ఛైర్మన్ రామ్మోహనరావు గారిని ఎప్పుడు ఏ పని నిమిత్తం కలిసినా ఎంతో సహకరించారని ఆయన చెప్పారు. తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘గోల్డ్ ఏజ్ హోమ్’ను ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో ప్రారంబిస్తామన్నారు. అలాగే ఏ సీఎం అయినా చెప్పిన ఫిగర్ ను రీచ్ కావడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, చెప్పి మరీ కేసీఆర్ మ్యాజిక్ ఫిగర్ ను దాటి భారీ మెజారిటీ సాధించారని ‘మా’ కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు.