ఉత్కంఠ భరితంగా సాగిన సినీ నటుల సంఘము ఎన్నికలలో నరేష్ విజయం సాధించారు. శివాజీ రాజాకు 199 ఓట్లు, నరేశ్‌కు 268ఓట్లు పోలయ్యాయి. 69 ఓట్ల ఆధిక్యంతో నరేశ్‌ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబుపై జీవిత రాజశేఖర్ గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ విజయం సాధించారు. జనరల్ సెక్రటరిగా రఘుబాబుపై జీవిత రాజశేఖర్ గెలుపొందారు. జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు, శివబాలాజీ విజయం సాధించారు. ట్రెజరర్‌గా కోట శంకర్రావుపై రాజీవ్ కనకాల గెలుపొందారు.