ఉన్నతమైన చదువు, ఉత్తమ ఉద్యోగంలో ఉండి కూడా ఓ ఐపీఎస్ అధికారి తన భార్య పట్ల పశువులా ప్రవర్తించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1986 బ్యాచ్ కి చెందిన పురుషోత్తం శర్మ అనే ఐపీఎస్ అధికారి కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యను విచక్షణ రహితంగా కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రజల రక్షణ బాధ్యతలను చూసుకునే పోలీస్ రాష్ట్ర అధికారిగా ఉన్నత హోదాలో ఉండి తన భార్యను కొట్టి పదవిని కోల్పోయాడు. అయితే ఆయన భార్యను కొడుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పురుషోత్తం శర్మ ఉద్యోగం నుండి తప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఘటనపై స్పందించిన పురుషోత్తం శర్మ.. తానేమి నేరగాడిని కాదని.. అది కేవలం కుటంబ గొడవ మాత్రమేనని చెప్పుకొచ్చారు.