టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డిని పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాగుంట.. పవన్ కళ్యాన్ని కలిశారు. కాగా పవన్ కళ్యాణ్ తనకు మిత్రుడని ఆయనను వ్యక్తి గతంగానే కలిశానని మాగుంట తెలియజేశారు. గత కొద్దీ కాలంగా ఆయన పార్టీ మారనున్నారని, వైసీపీ లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతుంది.

మాగుంట పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. తెలుగుదేశంలో కొనసాగలేక.. వైసీపీలోకి వెళ్లలేక మాగుంట జనసేనపై దృష్టిసారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న మాగుంట.. ఏ పార్టీలోకి వెళ్తారన్నది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కాగా ఆయన 2014 ఎన్నికలలో ఒంగోలు టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి మీద ఓటమి చెందారు.

magunta srinivasa reddy