దాదాపుగా ఒక 20 ఏళ్ళ క్రితమనుకుంటా మన తెలుగు సినిమా హీరోయిన్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఇప్పుడు తెలుగులో అలనాటి అందాల నటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా తీసిన “మహానటి” సినిమాకు సంబంధించి సావిత్రి పాత్రను అలవోకగా పోషించిన కీర్తి సురేష్ కు ఉత్తమ నటి అవార్డు వచ్చింది.

“మహానటి” సినిమా మొత్తం మూడు జాతీయ అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రానికి మూడు జాతీయ అవార్డ్స్ రావడంపై ఈ చిత్రానికి సంబంధించి కాస్ట్యూమ్ డిజైనర్ గౌరంగ్ షా మాట్లాడుతూ సావిత్రి వస్త్రధారణపై ఆరు నెలల పాటు అధ్యయనం చేసాం. 100 మంది ఆర్టిస్టులు కలిసి ఏడాది పాటు మహానటికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడానికి కష్టపడ్డాం. ఇంత కష్ట పడినా ఈ చిత్రానికి నేడు మూడు జాతీయ అవార్డ్స్ రావడమంటే చాల ఆనందంగా ఉంది. ఇక నుంచి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి ఈ అవార్డ్స్ నే తమకు ప్రేరణ అని అన్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •