లాక్ డౌన్ సడలింపులనివ్వడంతో అన్ని రాష్ట్రాలలో ఉన్న వలస కార్మికులను వారి వారి ప్రాంతాలకు తరలిస్తున్నారు. అందులో భాగంగా గతంలో ఎన్నో వందల కిలోమీటర్లు నడిచి వెళ్లిన వారికి ప్రభుత్వం సహాయం చేస్తుంటే ఇక మిగిలిన కొంతమందిని కొందరు దాతలు వారి వంతు సహాయం చేస్తు వారి ప్రాంతాలకు చేరుస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగులో సుపరిచితుడైన సోనూసూద్ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళనుకునే వలస కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేస్తున్నాడు.

మహారాష్ట్ర నుంచి గుల్బర్గాకు వెళ్లే వారి కోసం సోనూసూద్ బస్సులు ఏర్పాటు చేయడంతో మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, ఎన్సీపీ నాయకుడు జయంత్ పాటిల్ తన ట్విట్టర్ ద్వారా సోనూసూద్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. సినిమాలలో ఉత్తమ విలన్ గా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చే సోనూసూద్ నిజ జీతంలో సూపర్ హీరోగా మారి తన దాత్రుతను చాటుకుంటున్నదని, అందరూ అతడిని ఆశీర్వదించాలని, సోనూసూద్ అందరకి స్ఫూర్తినిచ్చే హీరో అని చెప్పుకొచ్చారు. సోనూసూద్ బస్సు దగ్గర నిలబడి వలస కార్మికులను పంపించే సమయంలో ఉన్న ఫోటోను తన అకౌంట్ లో మంత్రి షేర్ చేశారు.

అమెరికా దెబ్బకు ఉలిక్కిపడుతున్న ప్రపంచదేశాలు

నంద్యాల ఉపఎన్నిక మొత్తం ఆటనే మార్చేసింది