మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా విజృంభిస్తుంది. రెండు రోజుల్లో 278 మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకడంతో అక్కడ తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్ర వ్యాప్తంగా 1666 మంది పోలీసులకు ఈ వైరస్ సోకగా, 16 మంది మృతి చెందారు. ఇక ఈ వైరస్ బారిన పడిన పోలీసుల్లో 473 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా, 1177 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక తాజాగా రాష్ట్రవ్యాప్తంగా నిన్న 2345 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కరోనా భారిన పడిన వారి సంఖ్య 41642 కి చేరింది. వీరిలో 11726 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 28462 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక నిన్న 64 మరణాలు సంభవించడంతో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1454 కి చేరింది.

పెళ్ళికూతురికి కరోనా వైరస్.. క్యారంటైన్ కి 32 మంది..!

గుడ్ న్యూస్.. సెప్టెంబర్‌లో కరోనా వ్యాక్సిన్..!