మహేష్ బాబు ప్రెస్టేజియస్ 25వ సినిమా మహర్షి..

” గెలుపు కోసం బతికేవాడు మనిషి”.

” ఇతరులలో గెలుపు చూసేవాడు మహర్షి”.

అనే చిన్న సందేశంతో మిళితమైన ఒక వ్యక్తి ఒక్క జీవిత ప్రయాణమే ఈ ” మహర్షి”.

మొదటి రోజు ఈ సినిమా రివ్యూస్ చదివిన తరువాత కొన్ని విషయాలు ముందుగా చర్చించాలి

అందరు ఈ కధ లో చాలా సన్నివేశాలు ఇంతకుముందు మహేష్ సినిమా లనే గుర్తుకు చేసేలా వున్నాయి అని

పల్లెటూరు వెళితే శ్రీమంతుడు సినిమా అని …..

కాలేజీ సన్నివేశాలు త్రి ఇడియట్స్ సినిమా అని…..

హీరో నడిచి వస్తుంటే భరత్ అనే నేను అని…..

హీరో సీఈఓ ఐతే సర్కార్ మూవీ అని… ఎలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమా ని ఈ సినిమా కి పోల్చుతూ సినిమా లో వున్న అసలు సోల్ ని వదిలేశారు

కొన్ని కధల కి ముఖ్యంగా ఒక వ్యక్తి ఒక్క జీవిత ప్రయాణాన్ని మనకి ఆవిష్కరించేటప్పుడు ఖచ్చితంగా ఆ పాత్రని ఎస్టాబ్లిషమెంట్ చేయటానికి కొంచెం ఎక్కువ సమయమే కేటాయించాలి. అందుకే ఇంటర్వెల్ లోనే “రిషి జర్నీ స్టార్ట్ నౌ” అని దర్శకుడు ఫస్ట్ హాఫ్ ని ముగించాడు.హీరో ( రిషి) పాత్ర తాలూకు ఐడియాలజీని  , ఫాదర్ తో వున్న చిన్న అందమైన కాన్ఫ్లిక్ట్  ని , కాలేజీ లో తన స్నేహాలతో చాల సెన్సిబుల్ గా మొదటి భాగంని రూపొందించాడు

మహేష్ స్టూడెంట్ గెట్ అప్ లో చాల బాగా సూట్ అయ్యాడు.

నరేష్ కి చాల ఉదాత్తమైన పాత్ర దొరికింది

అన్ని కాలేజీ సన్నివేశాలు చాల బాగా అనిపిస్తాయి( మీరు ఏ సినిమాతో పోల్చుకోకుంటే…)

సెకండ్ హాఫ్ హీరో పల్లెటూరు వచ్చాక హీరో జీవితాన్ని చూసే విధానం లో మార్పు తీసుకొచ్చే సన్నివేశాలు అన్నిచాలా బాగా కుదిరాయి

తాను అనుకున్న లక్ష్యమే జీవితం అనుకునే మనిషి నిజ జీవితం లో జరిగే సంఘటనల ద్వారా మహర్షిగా మారే ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు చాల అద్భుతంగా తీర్చిదిద్దాడు.

ప్రతి సన్నివేశానికి మాటలు చాలా బాగా కుదిరాయి.

చివరిగా రైతుల వైపు నుండి సినిమాని ముగించడం అందరి హృదయాల్ని తాకుతుంది.

చివరిగా వచ్చే “పదరా పదరా” మరియు “ఇదే కదా” పాటలు సినిమాని ఇంకో లెవెల్ లో నిలబెట్టాయి.

మహేష్ తన స్క్రీన్ ప్రెసెన్స్ తో అదరగొట్టాడు

ప్రకాష్ రాజ్ , జయసుధ చిన్న పాత్రలు అయినా కూడా చాల ఉదాత్తమ మైన పాత్రలు దొరికాయి . ఈ మధ్య సినిమాల లో ఒక్క చిన్న డీవియేషన్ లేకుండా చెప్పాలి అనుకున్న పాయింట్ ని చాల సిన్సియర్ గా చెప్పిన సినిమా ఈ మహర్షి.

క్లైమాక్స్ ని ఒక భారీ ఫైట్ లేకుండా  ముగించడం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకి ఒక మంచి పరిణామమే.

ప్రతి పాత్ర చాలా అద్భుతంగా పెర్ఫర్మ్ చేశారు. ఉన్న రెండు డ్యూయెట్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి

చివరిగా…..

ఔనిత్యంతో కూడిన  పాత్రలు……

హృదయాన్ని తాకే సంభాషణలు…..

ఒక దర్శకుని సెన్సిబుల్ ఎఫర్ట్…..

ఒక మంచి సందేశం…..

తాలూకా భావాలని పొందాలంటే తప్పక ఈ ” రిషి ” ప్రయాణాన్నీ వీక్షించండి

ఇది భారమైన ప్రయాణం కాదు… మూడు గంటల అందమైన మనసుకు హత్తుకునే ప్రయాణం. డోంట్ మిస్ ఇట్.

హాట్స్ ఆఫ్ వంశీ పైడిపల్లి అండ్ టీమ్

రేటింగ్ 3.25/5