ఏపీ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలనే సంకల్పంతో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని నవంబర్ 10వ తేదీన విజయవాడలో కృష్ణానది ఒడ్డున మహా రుద్రాభిషేకంతో పాటు మహా భస్మాభిషేకంను నిర్వహించనున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదగా దేవదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

కార్తీకమాసం సందర్భంగా లోక కల్యాణార్థం రుద్రాభిషేకంలో అత్యంత ఘనంగా 8 అడుగుల మృతికా శివలింగానికి పూజలు చేయనున్నారు. ఆదివారం సాయంత్రం నాగ సాధువులతో, వేద పండితులతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఘనంగా జరగనున్న ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, దేవాదాయశాఖ అధికారులు హాజరుకానున్నారు.