‘RX100’ తరువాత భారీ గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. తన తర్వాత ప్రాజెక్ట్ ‘మహాసముద్రం’ను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించబోతున్నారు. ఇప్పటికే శర్వానంద్ పేరును ప్రకటించిన చిత్ర మేకర్స్.. ఇప్పడు తాజాగా మరో హీరోగా సిద్దార్ధ్ ను ప్రకటించారు. చాలా కాలం తరువాత తెలుగులో సిద్దార్ధ్ నటిస్తున్న సినిమా ఇదే. సిద్దార్ధ్ చివరిగా ‘గృహం’ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా తరువాత సిద్దార్ధ్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమరణార్థం.

ఇక దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్నాడు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ ద్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రతివారం ఓ ప్రకటన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలియచేసింది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మించనున్నారు.

బిగ్ బాస్ లో కరాటీ కళ్యాణి అభిమానులు పెరిగిపోతున్నారండి

ఇన్ని రోజులకు పవన్ కళ్యాణ్ కు ఉత్సాహం కలిగించేలా బీజేపీ చర్యలు

కేంద్రం నెత్తిన వంద లక్షల కోట్ల అప్పు, మన దేశంలో అవినీతిపరుల దగ్గర ఎంత సొమ్ము ఉందో తెలుసా?