భారత జట్టు మాజీ కెప్టెన్ టీమిండియా సభ్యుడు కీపర్ మహేంద్ర సింగ్ ధోని తన క్రికెట్ కెరీర్ కు రెండు నెలలు విరామం ప్రకటించి ఇండియన్ ఆర్మీకి సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ కాశ్మీర్ లో ఉన్న 106 టీఏ బెటాలియన్ (పారా)లో ధోని తోటి సైనికులతో కలసి లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ధోని తన విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు… ఇంకా జమ్మూ కాశ్మీర్ లో ఉత్కంఠ పరిణామాలు జరిగాయి.

ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ, కాశ్మీర్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ కలగడంతో… ధోని కూడా జమ్మూ కాశ్మీర్ యువకుల కోసం ఒక క్రికెట్ అకాడమీ నెలకొల్పాలని చూస్తున్నాడట. ఈ అకాడమీ ద్వారా ధోని జమ్మూ, కాశ్మీర్ యువకులకు క్రికెట్ లో ఉచితంగా శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ధోని త్వరలో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తల నేపథ్యంలో మరోవైపున రెండు నెలలుగా కాశ్మీర్ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించినవాడిగా అక్కడ యువకుల కోసం ధోని పెట్టబోయే అకాడమీకి ప్రభుత్వం పూర్తి సహకారం అందించే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •